మేడారం పనుల‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌వ‌తి

మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఇవాళ రోడ్డు ప‌నుల‌ను స‌మీక్షించారు.  మేడారం వెళ్లే దారిలోని ములుగు - నర్సంపేట రోడ్డు పనులను ఆమె పర్యవేక్షించారు.  అనంతరం గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేసి అక్కడి ఏర్పాట్లను చూసారు. ములుగు-న‌ర్సంపేట రోడ్డులో మరిన్ని లైట్స్, బారికేడ్స్ పెట్టాలని అధికారులని ఆదేశించారు.