ఫాస్టాగ్‌ను వాడుతున్న వినియోగదారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ అకౌంట్‌ను ఇకపై గూగుల్ పేతో రీచార్జి చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లను గూగుల్ పే యాప్‌కు లింక్ చేసుకుని అనంతరం ఆ అకౌంట్లను రీచార్జి చేసుకోవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి ఫాస్టాగ్ విభాగంలో ఉండే బిల్ పేమెంట్స్ సెక్షన్‌లో ఫాస్టాగ్‌ను ఇచ్చిన బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం వాహనం నంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బు చెల్లించాలి. ఇక వినియోగదారులు తమకు ఫాస్టాగ్‌లను ఇష్యూ చేసిన బ్యాంక్ అకౌంట్లలోకి లాగిన్ అయ్యి ఫాస్టాగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ లేకపోతే 91-8884333331 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఫాస్టాగ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు.