సిధ్‌ శ్రీరామ్‌ ‘మనసా మనసా’ లిరికల్‌ వీడియో

టాలీవుడ్‌ నటుడు అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలోని ‘మనసా మనసా’ పాట లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.  ‘మనసా మనసా మనసారా బతిమాలా తన వలలో పడబోకే మనసా..’ అంటూ సాగే ఈ పాటను యువ గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌ పాడాడు. సిధ్‌ శ్రీరామ్‌ తన వాయిస్‌తో మరోసారి మ్యూజిక్‌ లవర్స్‌ను  అలరించడం ఖాయమని పాట వింటుంటే అర్థమవుతోంది.  ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.