ఈశాన్య ఢిల్లీ కోలుకుంటున్నది. క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నది. వారం రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు. వాహనాల రాకపోకలు పెరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు, భద్రతా సిబ్బందిని మోహరించారు. షాహీన్‌బాగ్‌లో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆదివారం 144 సెక్షన్ విధించారు.