బిడ్డ నుంచి తల్లికి కరోనా

బిడ్డ నుంచి తల్లికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల హన్మకొండ పూరిగుట్టకు చెందిన పదేళ్ల బాలికకు కరోనా వ్యాపించింది. దీంతో ఆ బాలికను సికింద్రాబాద్ గాంధీకి మెరుగైన వైద్యం కోసం పంపించారు. అయితే బిడ్డకు పాజిటివ్ సోకినప్పుడు తల్లికి, తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే బిడ్డతో పాటు అటెండ్ గా ఉండేందుకు తల్లిని కూడా హైదరాబాద్ కు తరలించారు. అయితే తల్లికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవి ఓ ప్రకటన చేశారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 28 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో  25 మంది కోలుకుని ఇళ్ళకి చేరగా, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.